నిర్మల్ అర్బన్, అక్టోబర్ 5 : బతుకమ్మ ఆడుతున్న ఓ మహిళ డీజే సౌండ్ కారణంగా గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానిక బంగల్పేట్ కాలనీలో శనివారం బతుకమ్మ ఆడుతూ బిట్లింగ్ భాగ్యలక్ష్మి (56) అస్వస్థతకు గురై కుప్పకూలింది.
వెంటనే ఆమెను నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. డీజే సౌండ్ కారణంగానే గుండెపోటుతో మృతి చెందినట్టు వారు పేర్కొన్నారు.