కొల్లపూర్ రూరల్, ఆగస్టు 3 : కల్లు తాగి మహిళ మృతి చెందిన ఘటన కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్లలో ఆదివారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్ల గ్రా మానికి చెందిన మరాఠి మంగమ్మ (45) ఆదివారం కల్లు దుకాణానికి వెళ్లి కల్లు తాగి ఇంటికి బయలుదేరింది. కొంత దూరం వెళ్లి కిందపడి మృతి చెందింది.
మంగమ్మ మృతితో కోపోద్రిక్తులైన గ్రామస్థులు కల్లు దుకాణానికి వెళ్లి కల్లు సీసాలను ధ్వంసంచేశారు. బాధిత కుటుంబ సభ్యులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.