హనుమకొండ: హనుమకొండ జిల్లా దామెర మండలంలో విషాదం చోటుచేసుకున్నది. ఓ వివాహిత తన ఆరు నెలల పాపతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మకూరు మండలం హౌజ్బుజురుగు చెందిన ఆమని.. దామెర మండలంలోని పసరగొండ వద్ద వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బావిలో నుంచి ఆమనితోపాటు ఆరు నెలల పాప మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం దవాఖానతకు తరలించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.