పెండ్లికి నో చెప్పిందని హెచ్ఐవీ ఇంజెక్షన్.. యువతి బలవన్మరణం
పెండ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు ప్రేమించిన యువతిని నమ్మించి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటన నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం అందరికి తెలియడంతో అవమానాన్ని భరించలేక యువతి నెలరోజుల తర్వాత బలవన్మరణానికి పాల్పడిన ఘటన పోచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో/పోచారం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): పెండ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు ప్రేమించిన యువతిని నమ్మించి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటన నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం అందరికి తెలియడంతో అవమానాన్ని భరించలేక యువతి నెలరోజుల తర్వాత బలవన్మరణానికి పాల్పడిన ఘటన పోచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అన్నోజిగూడ ఆర్జీకే కాలనీలో నివాసముంటున్న యు వతి (24) కుటుంబం కొన్నేండ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి నివసిస్తున్నది.
ఈ క్రమంలో యువతి దగ్గర బంధువైన ఓ యువకుడిని ప్రేమించింది. వీరిద్దరికి పెం డ్లి కూడా చేయాలని వారి తల్లిదండ్రులు భావించారు. అయితే యువకుడి తల్లిదండ్రులకు హెచ్ఐవీ ఉండటంతో కొన్నాండ్ల క్రితం అతడి తండ్రి చనిపోయాడు. దీంతో యువకుడికి పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ ఉన్నట్టు లేలడంతో పెండ్లిని రద్దు చేశారు.
యువకుడు మాత్రం తన పెండ్లిని నిరాకరించిందనే కోపంతో యువతికి తన రక్తాన్ని గతనెల 11న ఎక్కించా డు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడు కటకటాల పాలయ్యాడు. అయితే ప్రేమించిన వాడే తన జీవితాన్ని నాశనం చేశాడని యువతి శుక్రవా రం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- commits suicide
- HIV
- Marriage
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

