తొర్రూరు, నవంబర్ 19 : ఎస్సై బెదిరించాడని ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బుధవారం చోటుచేసుకున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. స్థానిక అంబేదర్ నగర్‌కు చెందిన మంగళపల్లి వీరయ్యకు రవికుమార్, ప్రసాద్, యాకయ్య కు మారులు. వీరయ్య మున్సిపాలిటీలో తాతాలిక ఉద్యోగం చేస్తుండగా, వృద్ధాప్యంతో కుమారులతో చర్చించి ప్రసాద్‌కు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం వీర య్య పేరిట ఉన్న 22 గుంటల భూమిని ఇద్దరు కుమారుల పేరిట ఎస్సై సమక్షంలో రాయించారు. తన భర్త ప్రసాద్ పేరిట భూమి రాయడం గురించి ఎస్సై ఉపేందర్‌ను అడగ్గా బెదిరించాడు. దాదాపు రెండు నెలలుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తన ఫిర్యాదుపై స్పందన లేదని, ఎస్పీ కార్యాలయానికి వెళ్లినా ప్రయోజనం లేదని బాధితురాలు యాకాంత ట్యాంకు ఎక్కి ఆందోళనకు దిగింది. పీసీసీ నేత ఝాన్సీరెడ్డి ఫోన్లో యాకాంతతో మాట్లాడి సమస్యను తప్పకుండా పరిషరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందకు దిగింది.