కాసిపేట, ఏప్రిల్ 4 : ‘నా భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యిండు. ఆపరేషన్ చేయిస్తే పరిస్థితి మరింత వికటించి, మొత్తం లేవకుండా అయ్యిండు. బాంచెన్ జర పింఛన్ ఇప్పించి ఆదుకోండి’ అంటూ మంచిర్యాల జిల్లా కాసిపేట మం డలం మల్కెపల్లికి చెందిన మాసు పద్మ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాళ్లుమొ క్కి వేడుకున్నది. శుక్రవారం కాసిపేటలో మెగా వైద్య శిబిరానికి కలెక్టర్, ఎమ్మెల్యే హాజరయ్యారు. అదే సమయంలో అనారోగ్యంతో కుర్చీకే పరిమితమైన తన భర్త చిన్నయ్యతో అక్కడికి చేరుకున్నది. రిపోర్టులు చూపి ఆదుకోవాలని విలపించింది.