భద్రాచలం, నవంబర్ 8 : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ గోదావరి నదిలో దూకేందుకు యత్నించగా పోలీసులు, స్థానికులు కాపాడిన ఘటన భద్రాద్రి జిల్లా భద్రాచలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. సదరు మహిళ మాత్రం కానిస్టేబుల్ దూషించడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్టు చెప్తున్నది.
వివరాలు ఇలా.. భద్రాచలంలోని కొత్త కాలనీకి చెందిన కడారి స్వాతి కుటుంబ కలహాల నేపథ్యంలో గోదావరిలోకి దూకేందుకు యత్నిస్తుండగా గమనించిన స్థానికులు, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే మహిళ మాత్రం.. తాను ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే కానిస్టేబుల్ దూషించాడని, అసభ్యకర రీతిలో మాట్లాడటంతో ఆ బాధతో గోదావరిలో దూకేందుకు వచ్చినట్టు తెలిపింది.