సూర్యాపేట : ఇందిరమ్మ ఇల్లు ( Indiramma House ) మంజూరైతే దానిని మరొకరికి కేటాయించడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ జిల్లా ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ( Women Suicide Attempt ) పాల్పడింది. మునగాల మండల కేంద్రంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ( Collector Nanalal ) , జిల్లా ఎస్పీ నరసింహ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం మండలంలోని తాడ్వాయి గ్రామాన్ని ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అయితే తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా మరొకరికి కేటాయించారాని బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది.
ఆమెను హుటాహుటినా కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయ అండదండలతో సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని బాధితురాలు వాపోయింది.