హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20లోగా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా చర్య లు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తాని యా అధికారులను ఆదేశించారు. చేపట్టిన పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. శనివారం ఆ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, పీఆర్ ఈఎన్సీ సంజీవరావుతో కలిసి అన్ని జిల్లా ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, పీఆర్ ఈఈలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు సగటున 50కి, జిల్లా వ్యాప్తంగా 10 వేల మంది కూలీలకు తగ్గకుండా ఉపాధి పనులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ పనులను మార్చి 25 లోగా పూర్తి చేసి, వివరాలను ఎఫ్‌టీవోలో ఆన్లైన్ నమోదులు చేపట్టాలని ఆదేశించారు.