నందికొండ, ఏప్రిల్ 6: నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్‌పై విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణకు ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు వరకు నాగార్జునసాగర్ డ్యామ్‌పై విధులను ఎస్పీఎఫ్ బలగాలు చేపట్టాయి. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి పోలీసులతో డ్యాం 13వ గేట్ వరకు తమ స్వాధీనంలోకి తీసుకుంది.
రెండు రాష్ర్టాల మధ్య అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్యామ్‌పై ఎస్పీఎఫ్ బలగాలను తొలగించి, సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం ఏర్పాటు చేసింది. 15 నెలలుగా సీఆర్పీఎఫ్ బలగాలు రెండుగా విడిపోయి 13 గేట్ వరకు తెలగాణవైపు ఒక బృందం, 13వ గేట్ నుంచి ఆంధ్రా వైపు మరొక బృందం విధులు నిర్వహిస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకపోవడంతో వేచిచూస్తున్నట్టు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు.