హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేందుకు రూ.24 వేల వార్షిక స్కాలర్షిప్ను విప్రో సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ సూళ్లు/ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్స రంలో డిగ్రీలో చేరినవారికి ఈ స్కాల ర్షిప్ అందజేస్తామని సంస్థ ప్రతినిధి నీరజ్ కత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన విద్యార్థినులు ఈ నెల 30 వరకు www. santoorsc hlorship.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.