ఎమ్మెల్సీగా రాకేశ్‌రెడ్డిని గెలిపించండి
రాజకీయాల్లోకి యువత, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని, మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతి పరులు వస్తే మొత్తం సమాజమే నష్టపోతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
- ఆయన విద్యావంతుడు.. సమాజసేవకుడు
- జేడీ లక్ష్మీనారాయణ పిలుపు ఎక్స్‌లో పట్టభద్రులకు విజ్ఞప్తి
హైదరాబాద్, మే22 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లోకి యువత, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని, మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతి పరులు వస్తే మొత్తం సమాజమే నష్టపోతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. విద్యావంతుడు, సమాజసేవకుడు, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మిత్రుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డిని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుకుటుంబంలో పుట్టి, బిట్స్ పిలానీలో గోల్డ్‌మెడల్ సాధించి అమెరికా అవకాశం వదులుకొని సమాజం కోసమే రాకేశ్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. వరంగల్‌లో వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారని, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతగా ఏనుగుల రాకేశ్‌రెడ్డికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

