హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయాన్ని ముట్టడించిన తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేయడం అక్రమమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ తీరును ఖండించారు. పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కనికరం లేని కాంగ్రెస్ సరారు తన తీరు మార్చుకోవాలని సూచించారు. సర్పంచ్ల నుంచి కమీషన్లు రావన్న ఒకే ఒక్క కారణంతో నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడిన మాజీ సర్పంచ్లకు ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.