ఆసిఫాబాద్, జనవరి 19: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు మాదిగలంతా సిద్ధంగా ఉం డాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చా రు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి ఓటు చైతన్యం ద్వారానే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చే స్తామని బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీ మాదిగల వ్యతిరేక పార్టీగా మారిందని ఆరోపించారు. మాదిగ జాతి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ పనిచేస్తున్నదని అన్నారు.