వంశపారంపర్య అర్చకుల సమస్యలు పరిష్కరిస్తాం

దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న వంశపారంపర్య అర్చకుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త రంగరాజన్, యాదగిరి గుట్టకు చెందిన కారంపూడి నరసింహాచార్యులు, తెలంగాణ ఇనామ్దార్ అర్చకుల సమాఖ్యకు చెందిన పవన్‌కుమార్, తదితరులతో కూడిన వారసత్వ అర్చకుల ప్రతినిధి బృందం మంత్రిని శుక్రవారం కలిసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఏపీలో వంశపారంపర్య అర్చకుల కోసం పెండింగ్‌లో ఉండిన సర్వీసు రూల్స్ ఇప్పటికే అంటే 2019 అక్టోబర్ 21 నుంచి అమలు చేస్తున్నారని తెలిపారు. వంశపారంపర్య అర్చకులు, పూజారుల హక్కులను గుర్తించడం, తెలంగాణ రాష్ట్రంలో జీవో 439ని అమలు చేయడం ద్వారా, ఆయా దేవాలయాలలో అర్చకసేవలకు ఇచ్చిన ఇనాం భూములను కాపాడి, వంశపారంపర్య అర్చకులను బలోపేతం చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

