చిన్నకోడూర్, మార్చి 29: అడవి పందులు ఓ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించాయి. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో మంగళవారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన బొల్లం చంద్రయ్య పొలానికి వెళ్లగా, అతని భార్య పుష్ప, కూతురు భవానీ ఇంట్లో ఉన్నారు. అదేసమయంలో అకస్మాత్తుగా మూడు అడవి పందులు ఇంట్లోకి దూసుకొచ్చాయి. సామగ్రిని చిందరవందర చే