రామగిరి, నవంబర్ 21: తనను వివాహం చేసుకొని మరో మహిళతో కాపురం ఎలా చేస్తారని నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతిని భార్య మాధవి నిలదీసింది. మరో మహిళతో ఉంటున్న భిక్షపతి ఇంటికి వెళ్లిన ఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 25 మే 2010న తనకు భిక్షపతితో వివాహం జరిగిందని మాధవి తెలిపింది. పెండ్లి తరువాత భర్తతోపాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయగా, 4 ఏప్రిల్ 2011న గోదావరిఖని పోలీసుస్టేషన్లో కేసు న మోదైందని పేర్కొన్నారు. విడాకులు తీసుకోకుండా మరో పెండ్లి ఎలా చేసు కున్నారని భర్తను నిలదీస్తే తాను ఇలాగే ఉంటానంటూ బెదిరిస్తున్నట్టు తెలిపారు. కాగా డీఈవో ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న మాధవిని నల్లగొండ టు టౌన్ పోలీసులు వచ్చి స్టేషన్కు తీసుకెళ్లగా ఆమె భర్తపై ఫిర్యాదు చేసింది.