Extramarital affair | మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలిపోతున్నాయి. వరుసకు కొడుకు అయిన యువకుడితో వివాహేతర సంబంధం( Extramarital affair)పెట్టుకున్న ఓ మహిళ కట్టుకున్న భర్తను(Wife beats husband) కర్కశంగా హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇల ఉన్నాయి. యాదాద్రి భువనగిరి(Yadadri Dist) జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంకు చెందిన రాపోలు దానయ్య (36), శారద అనే దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
కాగా, దానయ్య సోదరుడి కొడుకు శివ(19)తో శారద వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన దానయ్య పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు వారిని హెచ్చరించాడు. ఈ నెల 23వ తేదీన శారద తన భర్తతో పొలం వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లింది. అప్పటికే అక్కడ పొదల్లో ఉన్న శివ వద్దకు చేరుకుంది. ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో చెట్ల పొదల్లో వెతకగా.. శివ, శారద సన్నిహితంగా ఉండడం చూసిన దానయ్య కోపంతో పక్కనే ఉన్న కర్రతో వాళ్లను కొట్టేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఆ కర్రను లాక్కుని శివ దానయ్య తలపై బలంగా కొట్టాడు. ఈ క్రమంలో పారిపోతున్న దానయ్యను శివ రాయితో కొట్టడంతో అతను కిందపడిపోగా, అతని కాళ్లను శారద గట్టిగా పట్టుకుంది. వెంటనే పెద్ద బండరాయితో తలపై శివ గట్టిగా కొట్టడంతో దానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఏమీ తెలియనట్లు శారద మీ అన్న కనిపించడం లేదని దానయ్య తమ్ముడు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పింది. విగతజీవిగా పడి ఉన్న దానయ్యను చూసి శ్రీను పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానంతో శారదను అదుపులోకి తీసుకుని విచారించగా, శివతో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మంటగలసిపోతున్న మానవ సంబంధాలు
వరుసకు కొడుకు అయిన యువకుడితో వివాహేతర సంబంధం.. భర్తను హతమార్చిన భార్య
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్న రాపోలు దానయ్య (36), శారద అనే దంపతులు
తన… pic.twitter.com/WUov50xMWr
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026