మహబూబ్నగర్ : సెల్ఫీ(Selfi) దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో జరిగింది. రాయచూర్(Rayacur District) జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణానది (Krishna River) వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుదామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. అతడు కొంతదూరం కొట్టుకుపోయి బండరాళ్ల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండటం గమనార్హం.