మానకొండూర్, సెప్టెంబర్ 28: క్షణికావేశంలో ఓ మహిళ కట్టుకున్న భర్తనే రోకలిబండతో విచక్షణారహితం గా దాడిచేసి కడతేర్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండల కేంద్రంలోని బేడబుడగ జంగం కాలనీకి చెందిన మోటం పోచయ్య(45), సమ్మక్క దం పతులు.
వీరికి ఓ కూతురు ఉండగా వివాహమైంది. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగింది. క్షణికావేశంతో సమ్మక్క భర్తపై రోకలిబండతో దాడి చేసింది. కాళ్లు, చేతులు, కడుపుపై కొట్టడంతో తీవ్రం గా గాయపడిన పోచయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య జరిగిన వెంటనే సమ్మక్క పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్చార్జి సీఐ స్వామి తెలిపారు.