హైదరాబాద్ : కామారెడ్డి(Kamareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కొడవలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. శివ, లక్ష్మి భార్య భర్తలు. కొంత కాలంగా కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో లక్ష్మి తన భర్తపై కొడవలితో దాడి చేసి హతమార్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
K.A. Paul | ట్రంప్ పాల్గొన్న ఈవెంట్లో కాల్పులు.. అదే హోటల్లో బస చేసిన కేఏ పాల్
Washington Hilton Hotel: రోనాల్డ్ రీగన్‌ను షూట్ చేసింది ఆ హోటల్ వద్దే..
Trump | ట్రంప్‌పై హత్యాయత్నం..వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు