హైదరాబాద్, జనవరి 30, (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం రాత్రి రెండో నోటీసు జారీచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారపగ్గాలు అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నిరంకుశత్వ వైఖరి పోలీసుల కార్యాచరణలో కొట్టొచ్చినట్లు కనబడుతున్నదని అంటున్నారు. చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తున్నారని చెప్పడానికి తాజాగా ఇచ్చిన నోటీసులే నిదర్శనమని న్యాయనిపుణులు చెప్తున్నారు. సీఆర్పీసీలోని 160 సెక్షన్ (బీఎన్ఎస్ఎస్ 179) ప్రకారమే నోటీసు ఇస్తున్నట్టు చెప్తూనే పోలీసులు ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని అంటున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఒకసారి పోలీసులు కేసీఆర్‌కు నోటీసులు జారీచేశారు.
ఈ నెల 30న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ లేదా హైదరాబాద్‌లో ఎకడైనా సరే విచారణకు హాజరుకావాలని పేరొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్, పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, సెక్షన్ 160 ప్రకారం తాను నివాసముండే ఎర్రవల్లి ఇంట్లోనే విచారణ జరపాలని పోలీసులకు లేఖ రాశారు. కానీ కేసీఆర్ వినతిని పోలీసులు ఏకపక్షంగా తిరసరించారని, ఇది సీఆర్పీసీలోని 160లోని నిబంధన స్ఫూర్తికి వ్యతిరేకమని నిపుణులు పేర్కొంటున్నారు. కేసీఆర్ వినతిని తిరసరిస్తున్నట్టు సిట్ అధికారులు తాజాగా నందినగర్‌లోని ఇంటిగోడకు అతికించిన నోటీసులో పేరొన్నారు. ఎన్నికల అఫిడవిట్, శాసనసభ రికార్డుల్లో కేసీఆర్ చిరునామా నందినగర్‌లోని ఇల్లుతో ఉంద ని, కాబట్టి ఆ ఇంట్లోనే ఫిబ్రవరి ఒకటిన మధ్యా హ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేరొనడాన్ని న్యాయనిపుణులు తప్పుపడుతున్నారు. ఎర్రవల్లిలో విచారణకు తాము రావాలంటే కీలకమైన రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాలేమన్నది కుంటిసాకు మాత్రమేనని అంటున్నారు.
మంగళగిరి పోలీసులకు చుక్కెదురు
సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం 65 ఏండ్లు పైబడిన వ్యక్తిని విచారించేందుకు ఫలానా పోలీస్‌స్టేషన్ లేదా ఫలానా ప్రదేశానికి రావాలని నోటీసులు ఇవ్వడం చెల్లదు. పిల్లలు, మహిళలు, మానసిక సమస్యలు, అనారోగ్యంతో బాధపడేవారికి కూడా అదే నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని న్యాయకోవిదులు గుర్తుచేస్తున్నారు. తమ పోలీస్‌స్టేషన్‌కు లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరుకావాలంటూ నోయిడాలో ఉండే వ్యక్తికి ఏపీలోని మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసును ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. హైకోర్టు సీఆర్పీసీ 160 లేదా దాని స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన బీఎన్ఎస్ఎస్ 179 కింద పోలీసులకు ఉన్న అధికార పరిధిని ఎత్తిచూపింది. నోయిడాలో ఉండే వీడీ మూర్తిని సెక్షన్ 179ఎస్ ప్రకారం పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని బలవంతం చేయలేరని పోలీసులకు తేల్చిచెప్పింది.
మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో 2024లో నమోదైన క్రిమినల్ కేసులో మూర్తి నిందితుడిగా లేరని, దర్యాప్తునకు సమాచారం తెలిసిన వ్యక్తిగా ఉన్నారని తెలిపింది. పైగా మూర్తి వయసు 65 ఏండ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నారని గుర్తుచేసింది. ఈ క్యాటగిరీ వ్యక్తులకు జారీచేసే నోటీసులు, వారి నివాసంలోనే విచారణ జరపడానికే ఉపయోగపడతాయని పేరొంది. ఈ నేపథ్యంలో నోయిడాలోని పిటిషనర్ మూర్తికి నోటీసులు జారీచేసే చట్టబద్ధమైన అధికారం దర్యాప్తు అధికారికి లేదని తేల్చి చెప్పింది. మూర్తికి ముందస్తు సమాచారం ఇచ్చి నోయిడాలోని ఆయన నివాసానికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేసేందుకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. పిటిషనర్‌ను విచారణ చేసేప్పుడు ఆయన కనిపించేంత దూరంలో అంటే పది పదిహేను అడుగుల దూరంలో న్యాయవాది ఉండేందుకూ అనుమతించాలని పేరొంది.
రాజ్యాంగబద్ధమైన ఈ తీర్పు ప్రకారం సిట్ పోలీసులు కేసీఆర్‌కు జారీచేసిన నోటీసులకు చట్టబద్ధత లేదని చెప్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్ జారీచేసిన రెం డో నోటీసుకు కూడా చట్టబద్ధత ఉండదంటున్నారు. సిట్ దర్యాప్తునకు సహకరిస్తామని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడమే కాకుండా పోలీసులకు లేఖ రాశాక కూడా కావాలని ఫలానా చోటే విచారణ చేస్తామని నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్ర పాలక పెద్ద పలికే చిలకపలుకలు మాదిరిగానే సిట్ అధికారుల వివరణ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. నందినగర్‌లోని ఇల్లే అసెంబ్లీ రికార్డులు, ఎన్నికల అఫిడవిట్లో ఉందనే కారణంగా ఇదే ఇంట్లో విచారణ చేస్తామని నోటీసుల్లో పేరొనడం ఏకపక్షమని, చెల్లుబాటు కాదని తెలుపుతున్నారు. ఒక వ్యక్తికి ఒకే ఇల్లు ఉండాలనే నిబంధన ఏమీ లేదని, ఒకే ఇల్లు ఉన్నప్పటికీ ఆ ఇంటిలోనే సదరు వ్యక్తి ఉండాలని కూడా చట్టంలో ఎకడా లేదని గుర్తుచేస్తున్నారు.