హైదరాబాద్ : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారి తీసిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మొత్తం 14 మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందగా, 13 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరికి కాలు ఫ్యాక్చర్ కాగా, మరొకరికి ఛాతీలో బుల్లెట్ దిగింది. ఈ ఇద్దరికి వైద్యులు సర్జరీ నిర్వహిస్తున్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు. అయితే గాయపడ్డ వారిలో 8 మంది వివరాలు తెలిశాయి.
1. జగన్నాథ రంగస్వామి(20), మంత్రాలయం, కర్నూల్ జిల్లా
2. కే రాకేశ్(20), చింతకుంట గ్రామం, కరీంనగర్ జిల్లా
3. జే శ్రీకాంత్(20), పాలకొండ గ్రామం, మహబూబ్‌నగర్ జిల్లా
4. ఏ కుమార్(21), వరంగల్ జిల్లా
5. పరుశురాం(21), నిజాంసాగర్, కామారెడ్డి జిల్లా
6. పీ మోహన్(20), నిజాంసాగర్, కామారెడ్డి జిల్లా
7. నాగేందర్ బాబు(21), ఖమ్మం
8. వక్కరి వినయ్(20)