హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మాటలు కోటలు దాటుతున్నా, విద్యార్థుల భవిష్యత్ ( Students futures ) కాలేజీ గేట్ దాటడం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ( Harish Rao ) విమర్శించారు. రేపటి తెలంగాణను నిర్దేశించాల్సిన యువతను సర్టిఫికెట్ల కోసం నడిరోడ్డు మీద నిలబెట్టారని దుయ్యబట్టారు.
ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు హరీష్‌రావును ఆదివారం కలిసి తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం పై ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోస మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసినా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు వారి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆరోపించారు.
ఎంతో కష్టపడి చదివి, కార్పొరేట్ కంపెనీల్లో 6, 7 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించినా.. ఆ ఆఫర్ లెటర్లు చేతిలో పట్టుకుని సర్టిఫికెట్ల కోసం ఏడుస్తూ కూర్చోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిల్లలు ఎందుకు బలి కావాలని నిలదీశారు.
కేసీఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 20,576 కోట్లను విడుదల చేసి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలబడ్డారని కొనియాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, పేదవాడికి ఉన్నత విద్యను దూరం చేయాలని చూస్తున్నారని మం డిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంటే మీకెందుకంత కక్ష రేవంత్ రెడ్డి అం టూ నిలదీశారు. ఇకనైనా మొండి వైఖరి విడనాడి, రోడ్డున పడ్డ పిల్లల ఆవేదనను అర్థం చేసుకోవాలని , తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి, సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు కోల్పోతున్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని హరీస్‌రావు డిమాండ్ చేశారు.