Asaduddin Owaisi | మామూ (కేసీఆర్)ను హ్యాట్రిక్ సీఎం చేయాలని మా అభ్యర్థి బరిలో లేని దగ్గరే చెప్తున్నం: అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీకి ‘ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM)’ బహిరంగంగా మద్దతిస్తున్నట్లు కనిపిస్తుందిగా అన్ని మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీకి ‘ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM)’ బహిరంగంగా మద్దతిస్తున్నట్లు కనిపిస్తుందిగా అన్ని మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తమ పార్టీ నుంచి బీఆర్ఎస్కు బహిరంగ మద్దతేమీ లేదని, అయితే.. తమ అభ్యర్థులు బరిలో లేని దగ్గర మామూ (కేసీఆర్)ను హ్యాట్రిక్ సీఎం చేయాలని చెబుతున్నామని ఆయన తెలిపారు.
‘అలాంటిదేమీ లేదు. మాపై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎక్కడైతే తమ అభ్యర్థులు పోటీలో లేరో అక్కడ మాత్రమే మేం మమూ (కేసీఆర్)ను హ్యాట్రిక్ సీఎంను చేయాలని ప్రజలను కోరుతున్నాం. కాబట్టి, మేం వాళ్లపై పోటీ చేస్తున్నాం, వాళ్లు మాపై పోటీ చేస్తున్నారు.. అంతేతప్ప బీఆర్ఎస్కు మా బహిరంగ మద్దతేమీ లేదు’ అని అసదుద్దీన్ చెప్పారు.
#WATCH | Telangana Elections | When asked that AIMIM is being seen supporting BRS openly in these elections, AIMIM president Asaduddin Owaisi says, “No, there are BRS candidates contesting against us on nine assembly seats. Wherever there isn’t a candidate, we have urged the… pic.twitter.com/BHx31KGDha
— ANI (@ANI) November 27, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

