సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశంలోనే గొప్ప పథకం. దళితుల గురించి గత ప్రభుత్వాలు ఆలోచించలేదు. పేదరికంలో ఉన్న దళితులను ఆర్థికంగా ఎదగాలని ప్రోత్సహిస్తున్నరు. రైతుబంధు మాదిరిగానే దళిత బంధు అమలు చేస్తామన్నందుకు సంతోషపడుతున్నాం. మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం. కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే ఈటల రాజేందర్ అక్కడక్కడ అభివృద్ధి పనులు చేసిండు. కేసీఆర్ లేకపోతే ఈటల ఎక్కడ? గ్రామాల్లోకి వెళ్లి కేసీఆర్‌ను విమర్శించడం సరికాదు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే రాజేందర్ గెలిచిండు. ఆయన స్వార్థం కోసమే జనాలను రెచ్చగొడుతున్నాడు. ఎంత రెచ్చగొట్టినా హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ వెన్నంటే ఉంటరు. ఈటల ఎన్ని ఆరోపణలు చేస్తే అంత ఎక్కువగా కేసీఆర్‌కు ఓట్లు పడుతాయి. – బండ శ్రీనివాస్ ( పెద్దపాపయ్య పల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం )
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. రాజీనామా చేయాలని ఈటల రాజేందర్‌కు కేసీఆర్ చెప్పలేదు. అనవసరంగా రాజీనామా చేసిండు. దత్తత తీసుకున్నా అని చెప్పిండు. దత్తత తీసుకున్నందుకు ఒక్క పని కూడా చేయలేదు. ఇది సార్ చేతకాని తనంగా భావిస్తున్నాను. 2016 నుంచి కేసీఆర్ తనను దూరం పెట్టిండు అని చెప్తున్న ఈటల.. ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న ఆయన ఆ రోజు ఎందుకు రాజీనామా చేయలేదు. ఇన్ని రోజులు పదవులు అనుభవించి.. లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ మొసలి కన్నీరు కారుస్తుండు. హుజూరాబాద్ ప్రజలను ఈటల తన బానిసలుగా చూస్తున్నాడు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఒక్కసారి కూడా తమను ఇంట్లోకి రానివ్వలేదు. ఈటల అనేక తప్పుడు పనులు చేసిన ఆయనకు ఓటు వేయొద్దని నిర్ణయించుకున్నాం. – గుజ్జ వాసుదేవరెడ్డి ( చిల్పూరు గ్రామం )