హైదరాబాద్, జూన్ 30 (నమ స్తే తెలంగాణ): ఆర్టీసీలో త్వరలోనే వాట్సాప్ టికెటింగ్, డిజిటల్ బస్‌పాస్‌ల సదుపాయాన్ని అమల్లోకి తెస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ముషీరాబాద్ డిపోను ఆర్టీసీ ఎండీతో కలిసి మంత్రి పొన్నం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ వాట్సాప్ యాప్‌లో ప్రయాణ వివరాలను నమోదు చేసి సులువుగా టికెట్లు పొందవచ్చని వివరించారు. ఆర్టీసీ యాప్‌లో డిజిటల్ బస్ పాస్‌లను పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీఎస్)లో భాగంగా ఐటిమ్స్, డిజిటల్ పేమెం ట్స్ అమలు తీరును స్వయంగా పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల బస్సుల్లో డిజిటల్ పేమెంట్ పూర్తయిందని తెలిపారు. త్వరలో ఓఆర్ ఆర్ లోపల మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని పేరొన్నారు.
గుడిసెలు వేసుకున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలి ; సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ నేతల బృందం విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తు న్న పేదలకు పట్టాలు ఇవ్వాలని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సోమవారం కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, బీవీ విజయలక్ష్మి, కపిల్ తదితరులు సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభు త్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కూనంనేని మాట్లాడు తూ.. అబ్దుల్లాపూర్‌మెట్, చేవెళ్ల, వరంగల్, భూపాలపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో పేద ప్రజలు ఏండ్ల తరబడి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పంచాయతీ వరర్స్, ఇతర అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, చిన్న ఉద్యోగులకు ప్రతినెల జీతాలను వెంటనే అందించాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు జరిపి, ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించాలని కోరారు.