కాజీపేట, ఆగస్టు 11 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధి బాలసముద్రంలో ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అనర్హులకు కేటాయించారని కాజీపేట పట్టణ కాంగ్రెస్ కార్యకర్త మద్దెల శోభారాణి ఆరోపించారు. సోమవారం ఆమె వాట్సాప్ లేఖను రేవంత్‌రెడ్డికి పంపించారు. ‘తాను 30 ఏండ్లుగా కాజీపేట పట్టణం 62వ డివిజన్లో అద్దె ఇంట్లో నివాసముంటూ కాం గ్రెస్ అభివృద్ధి కోసం పనిచేశానని, స్థానిక కార్పొరేటర్‌తో ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇంటి మం జూరు కోసం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి సిఫారసు చేయగా ఇండ్ల పంపిణీలో తన పేరును లిస్టులో నుంచి తొలగించారు’ ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే తన బినామీలకు, డబ్బులు ఇచ్చినవారికి ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు.