హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ) : భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీచేసే అధికారం కలెక్టర్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లేని అధికారాన్ని కలెక్టర్లు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ నౌకల్సా గ్రామం ప్రశాంతి హిల్స్‌లోని 66/2 సర్వే నంబర్లో 200 చదరపు గజాల ప్లాట్‌కు 2023 సెప్టెంబర్ 9న కలెక్టర్ ఎన్వోసీ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆళ్లగడ్డ చెన్నమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.