Delhi Liquor Policy | ఏమిటీ ఢిల్లీ మద్యం పాలసీ కేసు?
మద్యం విక్రయాల విషయంలో ప్రస్తుతం దేశంలో రెండు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొని లక్కీ డ్రాలో గెలిచిన ప్రైవేటు వ్యక్తులు.. చట్టపరంగా మద్యాన్ని రిటైల్‌గా విక్రయించడం ఒకటైతే, ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించడం రెండోది.
Delhi Liquor Policy | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మద్యం విక్రయాల విషయంలో ప్రస్తుతం దేశంలో రెండు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొని లక్కీ డ్రాలో గెలిచిన ప్రైవేటు వ్యక్తులు.. చట్టపరంగా మద్యాన్ని రిటైల్‌గా విక్రయించడం ఒకటైతే, ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నిర్వహించడం రెండోది. ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు మార్చి 2021లో నూతన మద్యం పాలసీకి ఢిల్లీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ పాలసీ అమల్లోకి వచ్చింది. కొత్త మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా 2022 జూలై 20న కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. దర్యాప్తు చేసిన ఈడీ, సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు పలువురిని అరెస్టు చేశారు. అయితే, ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు గత ఏడాది మేలో ఈడీని నిలదీయడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

