హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘అధికారంలోకి వస్తే.. జీవో 46ను రద్దు చేస్తాం’ ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ.. ఇప్పడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. ఆ హామీపై నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో బాధితులు భగ్గుమంటున్నారు. నాడు జీవో 46 బాధితులను రెచ్చగొట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు, ఆందోళనలు చేయించిన ఫొటోలు, ఆందోళనల దరఖాస్తులు ఇప్పు డు బయటికి వచ్చాయి. వాటి ప్రకారం 2023 జూలై 19న ఇందిరా పార్క్‌లో జరిగే జీవో 46 బాధితుల ధర్నాకు అనుమతి ఇవ్వాలని నాటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమర్గౌడ్ ఆధ్వర్యం లో హైదరాబాద్ సిటీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఆందోళనల్లో పాల్గొన్న పలువురిపై కేసులు నమోద య్యాయి. అధికారంలోకి వచ్చాక ఆ కేసులనూ మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికి రద్దు చేయలేదు. కాంగ్రెస్ మోసపూరిత కుట్రను నిలదీసేందుకు బుధవారం గాంధీభవన్‌ను ముట్టడించనున్నట్టు బాధితులు తెలిపారు.