హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ‘నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి 25 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉన్నాయని ఆనాడు ట్వీట్ చేశారు. మరి అధికారంలోకి వచ్చాక 11 వేల ఉద్యోగాలనే భర్తీచేశారు. అంటే 25 వేల టీచర్ పోస్టులు ఇస్తామన్న మాట తప్పారు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖ పద్దుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ పట్ల నిర్లక్ష్యం బట్టబయలైందని పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యాశాఖకే అతి తక్కువ నిధులు కేటాయించార ని, కేవలం 7.51% నిధులే కేటాయించారని విమర్శించారు. సర్వశిక్ష అభియాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.160 కోట్లు చెల్లించకపోవ డం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.250 కోట్ల నిధులు (60%)ఆగిపోయాయని తెలిపారు. సీఎం రేవంత్వద్దే విద్యాశాఖ ఉన్నదని, కేంద్రం నిధులు జమ చేయకపోతే మరి వై ఫల్యం ఎవరిదని ప్రశ్నించారు. 1913 పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ పేరు తో మూసివేశారని, 400 పాఠశాలల్లో రేషనలైజేషన్ అని టీచర్లందరినీ వేరే ప్రాంతాలకు తరలించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాఠశాలల్లో 3,60,000 మంది విద్యార్థులు తగ్గారని తెలిపారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా అని ప్రశ్నించారు.
భోజన కార్మికులకు 10 వేలివ్వండి
మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని గతంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను పునప్రారంభించాలని డిమాండ్ చేశారు.