వంద రోజుల హామీలు ఏమైనయ్?.. సర్కార్‌పై మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఫైర్
ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చిన 420కి పైగా హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సమస్యలు పరిషరిస్తామని చెప్పిన ప్రభుత్వం, 1000 రోజులు గడుస్తు న్నా కార్మికుల గోడు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చిన 420కి పైగా హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సమస్యలు పరిషరిస్తామని చెప్పిన ప్రభుత్వం, 1000 రోజులు గడుస్తు న్నా కార్మికుల గోడు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శనివారం బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్మికవర్గానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ దిశానిర్దేశం చేశారు. కార్మిక సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్మికులంతా సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజలముందు ఎండగట్టాల్సిన బాధ్యత ఉన్నదని ఆయన పేరొన్నారు.
సెప్టెంబర్ 2 నుంచి నిరసన కార్యక్రమాలు
కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా విసృ్తత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి జిల్లాలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, ఆటో కార్మికుల ప్రత్యేక సదస్సులు నిర్వహించడం వంటివి చేపట్టాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు నారాయణ, వేముల మారయ్య, హమాలీ శ్రీను, దాన కర్ణచారీ, సిలివేరు ప్రభాకర్, కిష్ణయ్య, మహేశ్ దేశపాక్, ప్రభాకర్, సంతోష్, మంజుల, స్వాతి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎండీవై పాషా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

