పైసా ఇవ్వకుండా ఎన్నికలు ఎలా.. పంచాయతీ ఎన్నికలకు నిధులేవి?
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ నిధులు కొరత అధికారులను తీవ్రంగా వేధిస్తున్నది. పాలనాపరమైన ఖర్చులకు కూడా నిధులు లేక ఎంపీడీవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు చిల్లిగవ్వ రాలేదని, కలెక్టర్లు కూడా తమకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గతంలో ఇచ్చిన రూ.315 కోట్లు ఖాళీ
- ఇప్పుడు ఒక్కో పోలింగ్ స్టేషన్ నిర్వహణకు రూ.20 వేల ఖర్చు
- చిల్లిగవ్వలేక ఎంపీడీవోల ఇక్కట్లు
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Grama Panchayathi Elections) సందడి మొదలైనప్పటికీ నిధులు కొరత అధికారులను తీవ్రంగా వేధిస్తున్నది. పాలనాపరమైన ఖర్చులకు కూడా నిధులు లేక ఎంపీడీవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు చిల్లిగవ్వ రాలేదని, కలెక్టర్లు కూడా తమకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి ఒక్కో మండలానికి కనీసం రూ.7 లక్షల వరకు విడుదలయ్యేవి. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పైసా కూడా విదల్చకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు (నిర్వహణ వ్యయం) ఎలా చెల్లించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. తొలి విడతలో ఎన్నికలు జరిగే 3,242 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. కానీ, ఈ ఎన్నికల నిర్వహణ, జీరాక్సులు, భోజనాలకు సైతం డబ్బులు లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి దాపురించిందని అధికారులు వాపోతున్నారు.
చెక్‌పోస్టుల ఏర్పాటు, వెబ్‌కాస్టింగ్ ఎలా?
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గతంలో ప్రభుత్వం రూ.315 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.150 కోట్లు ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం) ఎన్నికలకు, రూ.175 కోట్లు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలకు కేటాయించారు. ఆ నిధులన్నీ అప్పటి ఎన్నికలకే ఖర్చయిపోయాయని ఎంపీడీవోలు అంటున్నారు. నిధుల కోసం ఎస్ఈసీ అధికారులను అడుగగా.. నిర్వహణ ఖర్చులను పంచాయతీరాజ్‌శాఖ చూసుకుంటుందని, తమకు సంబంధం లేదని చెప్తున్నారు. పంచాయతీ అధికారులను అడిగితే.. 2023లో ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం నిధు లు ఇచ్చిందని, అప్పట్లో పోలింగ్‌కు రూ.10-12 వేలు ఖర్చు అవుతుందని ప్రతిపాదించామని తెలిపారు.
కానీ, ఇప్పుడు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని, ఆ మేరకు మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారుల నుంచి ఎంపీడీవోలకు చిల్లిగవ్వ కూడా రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వేలాది మంది ఉద్యోగులు, అధికారులకు భోజన బిల్లులు, ఇతర అలవెన్సులు చెల్లించేందుకు నిధులు లేకపోవడంతో ఆ భారాన్ని ఎవరు మోస్తారనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ అత్యవసర ఖర్చుల కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

