హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి గాలులు ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నాయని పేర్కొన్నది.
వీటి ప్రభావంతో బుధవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువగా, నాగర్కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసినట్టు వెల్లడించింది. గడిచిన 24గంటల్లో ఖమ్మం, వికారాబాద్, నాగర్కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపింది. గురువారం నుంచి పొడి వాతావరణం ఉండనున్నట్టు పేర్కొన్నది.