కమ్మర్పల్లి, అక్టోబర్ 10: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్‌లో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాల జోరు కొనసాగుతున్నది. వరుసగా మూడు రోజులుగా ఎనిమిది సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయగా.. మంగళవారం నాలుగు సంఘాలకు చెందిన 232 కుటుంబాలు వేముల ప్రశాంత్‌రెడ్డికి మద్దతు ప్రకటించాయి.
వాసంగట్టు తండా సంఘానికి చెందిన 90 కుటుంబాలు, ఎస్సీ మాదిగ సంఘానికి చెందిన 70 కుటుంబాలు, పద్మశాలి సంఘానికి చెందిన 40 కుటుంబాలు, శాలివాహన సంఘానికి చెందిన 32 కుటుంబాలు చేసిన ఏకగ్రీవ తీర్మానాలను స్థానిక నాయకులకు అందజేశాయి.