
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఢిల్లీకి చెందిన అఖిల భారత ఆర్య ఈడిగా రాష్ట్రీయ మహామండలి పీఠాధిపతి ప్రాణవనందన స్వామి ప్రశంసించారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ణు ప్రణవనంద స్వామి హైదరాబాద్లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గౌడ వృత్తిదారుల సంక్షేమం కోసం చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. దేశంలోనే గీత వృత్తిదారుల సంక్షేమం కోసం నీరా పాలసీని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టామన్నారు.

తాటి, ఈత చెట్ల పన్నును పూర్తి రద్దు చేయాడంతో పాటు గత బకాయిలను పూర్తి గా రద్దు చేశామన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి ఈత చెట్ల నుంచి పడి శాశ్వత అంగవైకల్యం చెందిన, మరణించిన వారికి 5 లక్షల రూపాయల ఏక్సి గ్రేషియోను అందిస్తున్నామన్నారు. వైన్ షాప్ల కేటాయింపులో గౌడలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని వివరించారు.
రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న కృషికి ప్రాణవనంద స్వామి కృతజ్ఞతలు తెలియజేశారు.
కర్ణాటకలోని యాదగిరిలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని స్వామి ప్రాణవనందన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఆహ్వానించారు.
దేశంలోనే గౌడ కులస్తుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందు ఉందని ప్రశంసించారు. నీరా పాలసీ, వైన్ షాపు లలో గౌడ కులస్తులకు రిజర్వేషన్ల ను దేశ వ్యాప్తంగా కల్పించాలని స్వామీజీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
