హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఫీజుల నియంత్రణకు చట్టం రూపొందించడాన్ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) స్వాగతించింది. చట్టం రూపకల్పనకు గతంలో నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు ఏకసభ్య కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్‌లో విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ శనివారం సమావేశం కానున్న నేపథ్యంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాదగిరి శేఖర్‌రావు, సాదుల మధుసూదన్, కోశాధికారి ఐవీ రమణారావు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.