హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : స్టాఫ్‌నర్సు ఉద్యోగాల తరహాలో రాష్ట్రంలోని కేజీబీవీ టీచర్లు, ఎస్ఎస్ఏ బోధనా సిబ్బందికి డీఎస్సీలో 10 శాతం వెయిటేజీకి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. హెచ్ఆర్ఏ స్లాబుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 1.5మార్కులు, అర్బన్ ప్రాంతాల్లో 1.3 మార్కులు, జీహెచ్ఎంసీ ఏరియాలో 1 మార్కు చొప్పన వెయిటేజీని ప్రతిపాదించారు.
గ్రామాల్లో ఆరున్నరేండ్లు, పట్టణ ప్రాంతాల్లో 8 ఏండ్లు, గ్రేటర్లో 10 ఏండ్లు పనిచేస్తే 10 మా ర్కుల చొప్పున ఇవ్వాలని సర్కారును కోరింది. రాష్ట్రంలో స్టాఫ్‌నర్స్ రిక్రూట్మెంట్లో 30 శాతం వెయిటేజీ అమల్లో ఉన్న ది. 70 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. టీచర్ల రిక్రూట్మెంట్లో టెట్ పరీక్షకు 20 మార్కుల వెయిటేజీ అమల్లో ఉం డగా, 80 మార్కులకు డీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్ఏ, కేజీబీవీ బోధనా సిబ్బందికి అదనంగా 10 మార్కులు కలువనున్నాయి.