నర్సింగ్ ఆఫీసర్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఎంపికైన 332మంది నర్సింగ్ అభ్యర్థులకు వెంటనే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
- చిన్నారెడ్డికి నర్సింగ్ అభ్యర్థుల వినతి
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఎంపికైన 332మంది నర్సింగ్ అభ్యర్థులకు వెంటనే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు అభ్యర్థులు ప్రజాభవన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెబ్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంలో అధికారు లు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని వాపోయారు.
వెబ్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో పోస్టింగ్ ఎక్క డ వస్తుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సర్కార్ నిర్లక్ష్యంతో తమ పిల్లలు ఈ విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై పలుమార్లు ఉన్న త అధికారులను సంప్రదించినా సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. అనంతరం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

