Weather Update | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను నేపథ్యంలో తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోనూ వర్షాలుపడుతాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని అంచనా వచేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో వానలుపడే అవకాశాలున్నాయని చెప్పింది. అలాగే ఈ నెల 4 వరకు తేలికపాటి జల్లులు పడే సూచనలున్నాయని పేర్కొంది.