దేశ సంపద కార్పొరేట్‌కు ధారాదత్తం
- కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ తిరోగమన విధానాలను తిప్పికొట్టాలి
- ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు, కార్మిక హక్కులను పరిరక్షించేందుకు చైతన్యవంతమైన పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చా రు. ఏఐటీయూసీ మూడు రోజుల జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో ఆదివారం ఆన్లైన్లో జాతీయస్థాయి బహిరంగ సభ నిర్వహించారు. కౌర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పాలనలో నిరుద్యోగిత రేటు 8.1 శా తానికి చేరుకున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ శాఖల్లో 9 లక్షల ఉద్యోగాలుఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. మార్చి 29, 30 తేదీల్లో నిర్వహిం చే సమ్మెలో కార్మికవర్గం పాల్గొని మోదీకి గుణపాఠం చెప్పాలని రాజ్యసభలో సీపీఐ పక్ష నాయకుడు బినో య్ విశ్వం పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, ఏఐటీయూసీ రాష్ట్రఅధ్యక్షుడు ఎస్ బాల్ సమావేశంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

