హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి తెలిపారు. శనివారం ప్రగ తిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. దివ్యాంగులకు సంబంధించిన పలు అంశాలపై మంత్రితో చర్చించారు. తెలంగాణ ప్ర భుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను మునుగోడు ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని మంత్రి వాసుదేవరెడ్డికి దిశానిర్దేశం చేశారు. పింఛన్‌దారులను సమన్వయం చేసుకొంటూ టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తామని వాసుదేవరెడ్డి అన్నారు.