కార్పొరేటుకు దీటుగా నిమ్స్‌ను బలోపేతం చేస్తాం
తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశం నలువైపుల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్‌ను కార్పొరేట్‌కు దీటుగా మరింత బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంచాలకులు డాక్టర్ రాహుల్ దేవరాజ్ అన్నారు.
- నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశం నలువైపుల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్‌ను కార్పొరేట్‌కు దీటుగా మరింత బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంచాలకులు డాక్టర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. నిమ్స్ కొత్త డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. నిమ్స్‌లో పేద రోగులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని, ఆ దిశగానే నిమ్స్‌ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిమ్స్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఎమర్జెన్సీ విభాగమని, ఎమర్జెన్సీలో బెడ్స్ దొరకవు అనే అపవాదు తొలగించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎమర్జెన్సీలో పడకల కొరత ఏర్పడకుండా అన్ని విభాగాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు. ఓపి, బిల్లింగ్ కౌంటర్ల సంఖ్యను రెట్టింపు చేశామని, సమాచారం, ఇతర సహయ, సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వారం పదిరోజుల్లోనే 100టన్నుల చెత్తను శుభ్రం చేయించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

