శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనవి. వీటి సమస్యలతో బాధపడే వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. చాలామందికి కిడ్నీలు పనిచేయక మార్చాల్సిన అవసరం ఏర్పడుతున్నది.
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది.