హైదరాబాద్, జూలై15 (నమస్తే తెలంగాణ): సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ, ఇతర అనుమతులను సాధ్యమైనంత త్వరగా సాధిస్తామని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఆయనతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సచివాలయంలో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీతారామ ఎత్తిపోతల పథకంతోపాటు సీతమ్మసాగర్ బరాజ్ పెండింగ్ సమస్యలపై, ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుసరిస్తున్న ప్రామాణిక కార్యాచరణ విధానానికి (ఎస్వోపీ) సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో 2023 మార్చి నుంచి సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ఆ చికులు వీలైనంత త్వరగా పరిషారమయ్యేలా, పర్యావరణ అనుమతులు మంజూరయ్యేలా అన్ని స్థాయిల్లోనూ కృషి చేస్తున్నామని చెప్పారు.