హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): వాహన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, ఆ సమస్యను పరిష్కరించే పనిలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిమగ్నమైనదని రవాణాశాఖ తెలిపింది. 15 రోజుల్లో పోర్టల్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
వాహన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’లో ‘వాహన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు’ కథనం ప్రచురితమైంది. దీంతో లోపాలను సవరిస్తున్నామని, దశలవారీగా ఆ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని రవాణాశాఖ తెలిపింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగానే సాగుతున్నదని పేర్కొంది.