హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే వేలాది మంది విద్యార్థులతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలతో జారీచేసిన జీవో-9తో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు.
ఈ జీవో ద్వారా విద్యార్థుల జీవితాలను ప్రభుత్వం పెనంమీది నుంచి పొయ్యిలోకి నెట్టేసినట్టయిందని పేర్కొన్నారు. ఈ పథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.