చిక్కడపల్లి, జనవరి 8: పెన్షన్‌పై సీలింగ్ ఎత్తివేయాలని, కరువుభత్యంతో కూడిన కనీస పెన్షన్‌ను నెలకు రూ.9 వేలు చెల్లించే దాకా పోరాడుతామని తెలంగాణ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఈపీఎస్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు అధ్యక్షుడు పీ నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అతుల్ దిగే, ధర్మార్జున్ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అత్యధిక పెన్షన్ మంజూరులో చేస్తున్న జాప్యాన్ని వ్యతిరేకిస్తూ పీఎఫ్ కార్యాలయాలను ముట్టిడిస్తామని తెలిపారు. ఈ సదస్సులో జాతీయ నేతలు బాల్‌రాజు, భూపాల్, కే సూర్యం, ఎం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఎం జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘డీఏ, పీఆర్సీలపై ప్రభుత్వంతో చర్చిస్తాం’
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లుల మంజూరు, డీఏ, పీఆర్సీ తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పైనా చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని భరోసా కల్పించారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్(టీఎస్టీయూ) 2024 డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శులు చందూరి రాజిరెడ్డి, అరకల కృష్ణాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.