హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ నిండా ముంచిందని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ సమావేశం గురువారం నిర్వహించారు. మారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పటికీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. సమావేశంలో రాంబాబు యాదవ్, పీ నారాయణ, మహేశ్ దేశపాక్, రంగారెడ్డి, పరుశురాం యాదవ్, నిరంజన్ పాల్గొన్నారు.